ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలపై దారుణాలు పెరిగిపోతున్నాయి : త్రిష

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 30, 2019, 05:53 PM

చిన్నారుల పట్ల జరుగుతున్నదారుణాల గురించి ఆవేదనతో మాట్లాడింది నటి త్రిష.’బాలికలు, మహిళలపై దారుణాలు పెరిగిపోతున్నాయి. వీటిలో తొంభై అయిదు శాతం అత్యాచారాలే. మన చుట్టుపక్కల ఏం జరుగుతుందోనన్న స్పృహ ఎవరికీ ఉండక పోవడం వల్లే ఇలాంటివి ఎక్కువవుతున్నాయి. అందుకే చిన్నారుల్లోను,యువతలోను వీటి పట్ల అవగాహన కల్పించాలని తెలిపింది. చెన్నై స్టెల్లా మేరీస్ కాలేజ్‌ ,తోళమై సంస్థలతో కలిసి యునిసెఫ్ ఓ సభనునిర్వహించింది. మూడువేల మంది యునిసెఫ్‌ కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రిష హాజరైంది.  అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉండొద్దు,ధైర్యంగా గళం విప్పండి, నేరస్తులకు శిక్ష పడేట్టు చెయ్యండి అంటూ ధైర్యం నూరిపోసింది. అంతేకాదు.. సినిమాలు చూసి హింసను అలవర్చుకోవద్దని, సినిమా అనేది ఓ కల్పన అని,దాన్ని అనుసరించొద్దని చెప్పింది. ఆమె మాటలు అక్కడున్నవారందరినీ ఎంతో ఇన్‌ స్పైర్ర్ చేశాయి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa