ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగస్టు 1న విడుదల కానున్న ‘ఉసురే’ చిత్రం

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 11, 2025, 06:24 PM

యదార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న వైవిధ్య గ్రామీణ ప్రేమకథా చిత్రం ‘ఉసురే’. నవీన్‌ డి. గోపాల్‌ దర్శకత్వంలో మౌళి ఎం. రాధాకృష్ణ నిర్మించారు. టీజయ్‌ అరుణాచలం, జననీ కునశీలన్‌ జంటగా నటించారు. నటి రాశీ కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఆగస్టు 1న ‘ఉసురే’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఇదొక వైవిధ్యమైన ప్రేమకథ’ అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాసుకున్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’ అని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa