ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాకు మగబిడ్డే పుడతాడు అంటున్న అమీ జాక్సన్!

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2019, 03:27 PM

నటి అమీజాక్సన్‌ ఆమె సన్నిహితులతో కలిసి బేబీ షవర్‌ వేడుకను జరుపుకుంది. ఈ పార్టీలో తనకు పుట్టబోయేది మగబిడ్డేనంటూ ఆమె ప్రకటించింది. ఇన్‌స్టా వేదికగా పుట్టబోయే బేబీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. బేబీ కోసం రూపొందించిన ఒక చిన్న ఉయ్యాల ఫొటోను షేర్‌ చేస్తూ‘మేము నీ కోసం ఎదురుచూస్తున్నాం’అంటూ క్యాప్షన్‌ ఇచ్చి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. బేబీ షవర్‌కు సంబంధించిన మరో ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘బేబీ షవర్‌ వేడుక చాలా బాగా జరిగింది. నాకు పుట్టబోయే మగబిడ్డ ఎంతో అదృష్టవవంతుడు. ఇంతమంది అద్భుతమైన ఆడవాళ్లు తనతో ఉన్నారు’ అనే వ్యాఖ్యను జతచేశారు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్‌ పనాయొటోతో  ఆమె కొంతకాలంపాటు డేటింగ్‌లో ఉన్నారు. డేటింగ్‌ అనంతరం వారిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa