cవాటి విలువ రూ.70 లక్షలుంటాయని ఆమె పేర్కొన్నారు. వింబుల్డన్ టోర్నమెంట్ వీక్షించడానికి లండన్‌కు వెళ్లిన సందర్భంలో తన నగలను బ్యాగేజీ బెల్ట్ ఏరియా నుంచి దొంగిలించారని ఆమె ఆరోపించారు. ఎయిర్‌పోర్ట్ అధికారుల నుంచి తనకు ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదని నిరాశను వ్యక్తం చేశారు. ఆమె ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. విమానాశ్రయంలో సరైన భద్రత లేకపోవడాన్ని ప్రశ్నించారు. ‘ముంబయి నుంచి ఎమిరేట్స్ విమానం ద్వారా లండన్ వెళ్లాను. అక్కడ గాట్విక్ విమానాశ్రయంలోని బ్యాగేజ్ బెల్ట్ నుంచి నా లగేజీ చోరీకి గురైంది. ఈ ఘటనతో నేను వేదనకు గురయ్యాను. విమానాశ్రయ అధికారుల నుంచి కూడా నాకు సరైన సహకారం అందడం లేదు’ అని ఆమె పేర్కొన్నారు.
బ్యాగేజ్ ట్యాగ్ మరియు టికెట్ ఉన్నప్పటికీ, బెల్ట్ ప్రాంతం నుంచి బ్యాగ్ అదృశ్యమైందని ఆమె వాపోయారు. ఇది తీవ్రమైన భద్రతాలోపాన్ని సూచిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఊర్వశి రౌతాలా.. ‘సింగ్ సాబ్ ది గ్రేట్’, ‘సనమ్ రే’ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు