హీరో మహేశ్‌బాబు ఫౌండేషన్ తొమ్మిదేళ్ల చిన్నారికి పునర్జన్మ ప్రసాదించింది. పశ్చిమ గోదావరి జిల్లా కుముదవల్లికి చెందిన పిల్లి వర్షితకు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఏర్పడింది. వయసు పెరిగే కొద్దీ దానికదే పూడిపోతుందని అప్పట్లో వైద్యులు చెప్పగా.. ఫలితం లేకపోవడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తల్లిదండ్రులు చిన్నారిని చూపించారు. శస్త్రచికిత్స చేయించాలని వైద్యులు చెప్పడంతో.. మహేశ్ బాబు ఫౌండేషన్ సభ్యులను సంప్రదించగా విజయవాడలోని హార్ట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa