ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటితో 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'బింబిసార'

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 05, 2025, 05:47 PM

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' చిత్రం 2022లో తెలుగులో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ ఫాంటసీ డ్రామా కళ్యాణ్ రామ్‌ యొక్క అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు వశిస్ట్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రస్తుతం జీ5లో వివిధ భాషలలో ప్రసారం అవుతోంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా నేటితో విడుదలై 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కళ్యాణ్ రామ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కేథరిన్ త్రెసా, సంయుక్తా మీనన్, వారిన హుస్సేన్, వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి, బ్రహ్మాజీ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa