బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవలే 'గాల్వాన్' అనే చిత్రాన్ని ప్రకటించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా యొక్క మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేయగా భారీ స్పందన లభించింది. ఈ సినిమాలో ప్రముఖ నటి చిత్రాంగద సింగ్ ముఖ్య పాత్రలో నటిస్తుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క లఢక్ షెడ్యూల్ ని సెప్టెంబర్ లో ప్రారంభించనున్నట్లు సమాచారం. భయంకరమైన గాల్వాన్ వ్యాలీ ఘర్షణ నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రం భారతదేశ సైనిక చరిత్రలో కీలకమైన క్షణాన్ని అన్వేషిస్తుంది. ఈ దేశభక్తి యాక్షన్ డ్రామా కోసం అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పోర్వా లఖియా దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa