తుషార్ జలోటా దర్శకత్వంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా ఒక ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ కి 'పరమ సుందరి' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క షూటింగ్ ని పూర్తి చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సెట్స్ నుండి ఒక చిత్రాన్ని విడుదల చేసింది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ఆగస్టు 29, 2025న విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ కింద దినేష్ విజయన్ నిర్మించారు. సచిన్ - జిగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa