ఢిల్లీలోని అన్ని కుక్కలను 8 వారాల్లోగా షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై సినీతారలు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ సదా ఇన్ స్టాలో ఓ వీడియో పోస్టు చేశారు. 'ఒక్క రేబిస్ కేసు కోసం దాదాపు 3 లక్షల కుక్కల్ని షెల్టర్లకు తరలిస్తారు. లేదా చంపేస్తారు' అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. 8 వారాల్లో షెల్టర్స్ ఎలా సిద్ధం చేయగలరని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa