నటి జాన్వీ కపూర్ ముంబయిలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో పొల్గొంది. ఈ వేడుకల్లో ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినదించగా.. సోషల్ మీడియాలో కొందరు ట్రోల్స్ మొదలుపెట్టారు. “స్వాతంత్య్ర దినోత్సవం, కృష్ణాష్టమి వేరు.. ఆ నినాదం అవసరమా?” అంటూ విమర్శలు చేశారు. దీనిపై జాన్వీ స్పందించింది. అక్కడ ఉన్నవారంతా ముందే ‘భారత్ మాతాకీ జై’ అన్నారని..ఆ తర్వాత తాను అన్నట్లు తెలిపింది. అయినా దేశాన్ని పొగడటానికి రోజుతో సంబంధం లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa