ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపూల్స్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రణబీర్ కపూర్, అలియా భట్. ఇద్దరూ ఇప్పుడు వరుస లతో బిజీగా ఉన్నారు.యానిమల్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రణబీర్.. ఇప్పుడు యానిమల్ 2 కోసం రెడీ అవుతున్నారు. అలియా, రణబీర్ కపూర్ వివాహం చేసుకుని మూడు సంవత్సరాలు అయింది. ఈ జంటకు రాహా అనే పాప జన్మించిన సంగతి తెలిసిందే. ఈ స్టార్ కపుల్ ఇప్పుడు చాలా విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆ ఇంటి నిర్మాణం చివరి దశలో ఉంది. ఆ ఇంటికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.రణబీర్ కపూర్, అలియా భట్ ముంబైలోని సంపన్న ప్రాంతంగా పిలువబడే బాంద్రాలోని పాలి హిల్స్‌లోని వారి పూర్వీకుల భూమిలో ఒక విలాసవంతమైన ఇంటిని నిర్మించారు. అక్కడ గతంలో కృష్ణరాజ్ బంగ్లా ఉండేది. ఈ కొత్త ఇల్లు రణబీర్ కపూర్, అలియా భట్ కుమార్తె రహా పేరు మీద రిజిస్టర్ చేయించారు. రణబీర్-ఆలియా నిర్మించిన ఇంటి విలువ దాదాపు రూ.250 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ విలాసవంతమైన ఇంట్లో అనేక ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. రణబీర్, ఆలియా ప్రపంచంలోని అత్యుత్తమ పదార్థాలను ఉపయోగించి ఈ ఇంటిని నిర్మించారు. ఈ ఇంటికి అత్యుత్తమ టైల్స్, ఫర్నిచర్, అలంకరణ దీపాలు, సోఫాలు తీసుకువచ్చారు.ఆ ఇంట్లో జిమ్, స్విమ్మింగ్ పూల్, కూతురికి ప్లే రూమ్, రణబీర్ కపూర్ కోసం గేమ్ జోన్, ప్రైవేట్ , ఆఫీస్, ప్రైవేట్ బార్, పెద్ద గ్యారేజ్, లైబ్రరీ ఉన్నాయి. ఈ ఇంటి లిఫ్ట్ కూడా కార్లను పైకి తీసుకువెళుతుంది. గేటు లోపలికి వెళ్లే కారు నేరుగా లిఫ్ట్ ద్వారా ఇంటి హాలుకు వెళుతుంది. అదనంగా, ఈ ఇంటికి అత్యుత్తమ భద్రతా వ్యవస్థ ఉంది. రెండు రోజుల క్రితం ఈ ఇంటి వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వైరల్ అయింది. ఆ ఇంటి ఇంటీరియర్ డిజైన్ వీడియోలో కనిపించింది. దీంతో అలియా కాస్త కఠినంగానే స్పందించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa