కోలీవుడ్ నటుడు సూరి ప్రధాన పాత్రలో నటించిన కుటుంబ నాటకం 'మామన్' మిశ్రమ సమీక్షలను అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ రేసును గెలిచింది. ఈ సినిమాలో ఐశ్వర్య లెక్ష్మి మహిళా ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా యొక్క ఒరిజినల్ వెర్షన్ జీ5 లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. తాజాగా ఇప్పుడు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ఈ సినిమా యొక్క కన్నడ మరియు తెలుగు వెర్షన్స్ ప్రసారానికి అందుబాటులోకి వచ్చినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ప్రశాంత్ పాండియరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లార్క్ స్టూడియోలో కె. కుమార్ నిర్మించారు. స్వాసికా, బాలా శరవణన్, విజీ చంద్రశేఖర్, భాస్కర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని స్వరపరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa