ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో విడుదల కానున్న 'కపుల్ ఫ్రెండ్లీ'

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 27, 2025, 03:30 PM

అశ్విన్ చంద్రశేకర్ దర్శకత్వంలో టాలీవుడ్ యువ నటుడు సంతోష్ శోభన్ 'కపుల్ ఫ్రెండ్లీ' అనే చిత్రంతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రంలో సంతోష్ సోభన్ సరసన జోడిగా మనసా వారణాసి జోడిగా నటించారు. తెలుగు మరియు తమిళ భాషలలో త్వరలో గొప్ప థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ని విడుదల చేయగా భారీ స్పందన లభించింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా నుండి స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సినిమాటోగ్రఫీని దినేష్ పురుషుతమన్ నిర్వహిస్తుండగా, సంగీతాన్ని ఆదిత్య రవీంద్రన్ స్కోర్ చేస్తున్నారు. ఈ చిత్ర సాంకేతిక సిబ్బందిలో ఎడిటర్ గా గణేష్ శివ, ఆర్ట్ డైరెక్టర్‌గా మైఖేల్ బిఎఫ్‌ఎ ఉన్నారు. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ ప్రదర్శనలో యువి కాన్సెప్ట్స్ నిర్మిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa