ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జగర్లముడి దర్శకత్వం వహించిన అనుష్క శెట్టి యొక్క 'ఘాటీ' చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో విక్రమ ప్రభు, చైతన్య రావు, జగపతి బాబు మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా యొక్క పవర్-ప్యాక్డ్ ట్రైలర్ కి భారీ స్పందన లభించింది. ఈ సినిమాని మేకర్స్ భారీగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈరోజు వినాయక చవితి స్పెషల్ గా సెలెబ్రేట్ ది మ్యూజిక్ అఫ్ ఘాటీ అనే టైటిల్ తో స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ లో ప్రసారానికి అందుబాటులోకి వచ్చినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. యువి క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రంలో నాగవెల్లి విద్యా సాగర్ స్వరపరిచిన సంగీతాన్ని కలిగి ఉంది. ఈ చిత్రం సెప్టెంబర్ 5, 2025న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa