కలర్ ఫోటోకు పేరుగాంచిన యువ దర్శకుడు సందీప్ రాజ్ తన తాజా చిత్రం మోగ్లీ 2025 తో తిరిగి వచ్చాడు. రోషన్ కనకాలా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇప్పటికే బజ్ ని క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్, హర్ష కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని వరల్డ్ అఫ్ మోగ్లీ వీడియోని ఆగష్టు 29న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ వీడియోని రేపు మధ్యాహ్నం 4:05 గంటలకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. పీపుల్మీ డియా ఫ్యాక్టరీ బ్యానర్ క్రింద టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో సాక్షి మడోల్కర్ మహిళా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీత దర్శకుడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa