ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మా ఊరి పొలిమెర 2' వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ కి టైమ్ లాక్

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 29, 2025, 08:44 AM

డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన 'మా ఊరి పొలిమెర 2' సినిమా సాలిడ్ హిట్ గా నిలిచింది. హారర్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా మొదటి భాగం యొక్క విజయంతో దాని హైప్‌తో ఈ చిత్రం కొంచెం ఎక్కువ స్కోర్ చేసింది. ఈ చిత్రంలో సత్యం రాజేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య, సాహితీ దాసరి, రవివర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం ఆగష్టు 29, 2025 రాత్రి  9:30 గంటలకు స్టార్ మా మూవీస్ ఛానల్ లో ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌ను ప్రదర్శించనుంది. ఈ సినిమాని శ్రీ కృష్ణ క్రియేషన్స్ నిర్మించగా, గౌర్ ఘనబాబు సమర్పిస్తున్నారు. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారానికి అందుబాటులో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa