తమిళ స్టార్ హీరో విశాల్ తన ప్రియురాలు, హీరోయిన్ సాయి ధర్షికతో నిశ్చితార్థం చేసుకున్నారు. చెన్నైలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'నా పుట్టిన రోజు సందర్భంగా నన్ను ఆశీర్వదిస్తూ విషెస్ తెలియజేసిన అందరికీ ధన్య వాదాలు. ఎప్పటిలాగే మీ అందరి ఆశీర్వాదాలు మాపై ఉండాలని కోరుకుంటున్నా' అని విశాల్ ట్వీట్ చేశారు. ఎంగేజ్‌మెంట్ ఫొటోలను పంచుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa