జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న "జయంబు నిశ్చయంబురా" అనే టాక్ షో ప్రస్తుతం జీ5 ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కింగ్ నాగార్జున ఈ షోలో పాల్గొని మంచి హంగామా చేశారు.అయితే, ఎంత కష్టపడినా ఈ షోకు ఆశించిన స్థాయిలో క్రేజ్ రాలేదు. అందుకే తాజాగా షో టీమ్, సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ఇద్దరు సంచలన దర్శకులను రంగంలోకి దించింది. వారు ఎవరో కాదు – రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) మరియు సందీప్ రెడ్డి వంగా.ఈ ఇద్దరూ ఒకే వేదికపై ఉంటే రచ్చ వేరే లెవెల్‌లో ఉంటుంది. వీరి ఆలోచనా శైలి దగ్గరగా ఉండటంతో ఈ కాంబోకు ప్రత్యేక క్రేజ్ ఉంది. అందుకే తాజా ఎపిసోడ్ కోసం వీరిద్దరిని ఆహ్వానించినట్టు సమాచారం. ఇప్పటికే షూటింగ్ పూర్తయిందట.ఈ ఎపిసోడ్‌లో కాంట్రవర్షియల్ ప్రశ్నలు, వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలపై చర్చ జరిగిందని తెలుస్తోంది. ఈ ఇంటర్వ్యూలో రచ్చ గ్యారంటీ అని షో టీమ్ అంటోంది. ఇది "జయంబు నిశ్చయంబురా"కు కొత్త జోష్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు.జగపతి బాబు హోస్టింగ్ బాగానే చేస్తున్నా, బాలకృష్ణ హోస్ట్ చేసిన "అన్‌స్టాపబుల్" లాంటి క్రేజ్ మాత్రం ఇప్పటివరకు ఈ షోకు రాలేదు. అయినా, జగపతి బాబు ఎక్కువగా పెద్ద సెలబ్రిటీలను షోకు తీసుకురావడంలో కసరత్తు చేస్తున్నాడు. త్వరలోనే స్టార్ హీరోలు కూడా ఈ షోలో కనిపించే అవకాశముందని ప్రచారం సాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa