ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శింబు - వెట్రిమరన్ చిత్రం గురించిన లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 30, 2025, 04:35 PM

కోలీవుడ్ స్టార్ దర్శకుడు వెట్రిమెరన్ ప్రముఖ నటుడు సూర్యతో వాడివాసల్ పేరుతో ఒక చిత్రం చేయాల్సి ఉంది. జల్లికట్టు స్పోర్ట్ఆ ధారంగా ఈ చిత్రం బహుళ కారణాల వల్ల నిరంతర జాప్యాలను ఎదుర్కొంటోంది. తత్ఫలితంగా వెట్రిమెరన్ వాడివాసల్‌ను పక్కన పెట్టి శింబుతో కొత్త ప్రాజెక్టును ప్రకటించారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా 'STR49' అనే టైటిల్ లాక్ చేసారు. ఈ చిత్రం ఆర్థిక సమస్యల కారణంగా ఆగిపోయినట్లు పుకార్లు ఉన్నప్పటికీ సెప్టెంబరులో షూటింగ్ ప్రారంభమవుతుందని మేకర్స్ కన్ఫర్మ్ చేసారు. ప్రముఖ నటుడు మణికందన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఇప్పుడు దర్శకుడు వెట్రిమారన్ ఈ సినిమాకి సంబందించిన అప్డేట్ ని 15 రోజులలో వెల్లడించనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేయాలని చిత్రనిర్మాత యోచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa