ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సెకండ్ సింగల్

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 01, 2025, 08:50 AM

రామ్ దేశిన దర్శకత్వంలో టాలీవుడ్ యువ నటుడు నాగ శౌర్య ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌ కి 'బ్యాడ్ బాయ్ కార్తీక్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ కి భారీ స్పందన లభించింది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క సెకండ్ సింగల్ ని మై డియర్ జనతా అనే టైటిల్ తో విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ లో 2 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో విధి మహిళా ప్రధాన పాత్రలో నటించింది. సముద్రకని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి మరియు శ్రీదేవి విజయ్‌కుమార్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్  ని పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లోకి వెళ్ళింది. ఈ సినిమాకి  రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు మరియు హారిస్ జయరాజ్ సంగీత స్వరకర్తగా ఉన్నారు. రామాంజనేయులు కళా దర్శకత్వం వహిస్తుండగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీ వైష్ణవి ఫిలింస్ పతాకంపై శ్రీనివాసరావు చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa