హారర్-కామెడీ చిత్రం 'ముంజ్యా' జూన్ 7, 2024న థియేటర్‌లలో విడుదలైనప్పటి నుండి భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచ బాక్స్ఆఫీస్ వద్ద ఈ చిత్రం 132 కోట్ల గ్రాస్ ని వాసులు చేసింది. ముంజ్యా కేవలం 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడినప్పటికీ 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన ఆరవ హిందీ చిత్రంగా నిలిచింది. శర్వరి, అభయ్ వర్మ, సత్యరాజ్ మరియు మోనా సింగ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించారు మరియు అమర్ కౌశిక్ మరియు మాడాక్ ఫిలిమ్స్ యొక్క దినేష్ విజన్ నిర్మించారు. ఈ చిత్రం భారతీయ పురాణాలు మరియు జానపద కథల ఆధారంగా మడాక్ సూపర్‌నేచురల్ యూనివర్స్ యొక్క నాల్గవ భాగం. చిత్ర విజయానికి హారర్ మరియు కామెడీ యొక్క ప్రత్యేకమైన సమ్మేళనం కారణమని చెప్పవచ్చు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క సీక్వెల్ లో ప్రతిభా రాంటా ప్రధాన పాత్ర పోషిస్తుంది అని సమాచారం. ముంజా 2 ను విస్తరించడానికి ప్రతిభా పాత్ర కొత్త కథాంశాన్ని ప్రవేశపెట్టవచ్చు లేదా ఇతర చిత్రాల సంఘటనలకు ఆశ్చర్యకరమైన సంబంధం కలిగి ఉంటుంది అని టాక్. 2025 చివరి నాటికి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa