అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ భారీ స్థాయిలో దర్శకత్వం వహించిన తెలుగు చిత్రాలలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఘాటి' ఒకటి. డైరెక్టర్ క్రిష్ మరియు నిర్మాత రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఘాటీ చిత్రం సెప్టెంబర్ 5, 2025న పెద్ద స్క్రీన్‌లపైకి రానుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క కర్ణాటక ప్రెస్ మీట్ ని ఈరోజు అంటే సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 4 గంటలకి బెంగుళూరులోని హైడ్ పార్క్ హోటల్ లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు విక్రమ్ ప్రభు, జగపతి బాబు, చైతన్య రావు, రావేంద్ర విజయ్, జాన్ విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఘాతీ పాన్-ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి విద్య సాగర్ సంగీతాని అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa