ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సేషన్ ని సృష్టిస్తున్న 'OG' నార్త్ అమెరికా ప్రీమియర్ ప్రీ-సేల్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 04, 2025, 03:20 PM

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైన్ అప్ లో భారీ ప్రాజెక్ట్ ఉన్నాయి. వాటిలో ఒకటి టాలెంటెడ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న 'OG'. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ జాపనీస్ నటుడు కాజుకి కీటమురా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, షామ్ మరియు హరీష్ ఉత్తమన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్స్ ని ప్రత్యంగిరా సినిమాస్ బ్యానర్ సొంతం చేసుకుంది. USA ప్రీమియర్ ప్రీ-సేల్స్ ప్రత్యక్ష ప్రసారం కావడానికి ముందే ఈ చిత్రం ఇప్పటికే $1M కి పైగా రాబట్టింది. పూర్తి బుకింగ్‌లు ఓపెన్ కాకుండానే ఈ సినిమా సెన్సేషన్ ని సృష్టిస్తుంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ గ్యాంగ్స్టర్ డ్రామా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa