KGF ఫ్రాంచైజీలో తన ఐకానిక్ పాత్రకు ప్రసిద్ధి చెందిన రాకింగ్ స్టార్ యాష్ ప్రశంసలు పొందిన గీతూ మోహన్‌దాస్ హెల్మ్ చేసిన 'టాక్సిక్' అనే గ్యాంగ్‌స్టర్ డ్రామాలో తదుపరి పాత్రలో కనిపించనున్నాడు. భారీ అంచనాలున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా నుండి ఇటీవల మేకర్స్ యశ్‌ను బాదాస్ అవతార్‌లో గ్లింప్సెని విడుదల చేయగా భారీ స్పందన లభించింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాకి బుక్ మై షో పోర్టల్ లో 200K ఇంట్రెస్ట్స్ ఉన్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో నయనతార, హుమా ఖురేషి, సాన్విక మరియు తారా సుతారియా ప్రముఖ పాత్రల్లో నటించారు. ఈ చిత్రం మార్చి 19, 2026న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa