ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెల్లువచ్చి గోదారమ్మ రీమేక్ సాంగ్ లో పూజ హెడ్జ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 17, 2019, 11:54 AM

శోభన్ బాబు మూవీ దేవతలో ‘వెల్లువచ్చి గోదారమ్మ ..’ పాట ఎంత ఫ్యామసో అందరికీ తెలుసు. ఆ సాంగ్ యూట్యూబ్ లో ఇప్పటికీ ట్రెండింగ్. అన్ని బిందెలు ఎలా వాడారో అని ఇప్పటికీ ఆసక్తిగా గమనిస్తుంటారు.తాజాగా వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న వాల్మీకీ మూవీలో ఈ పాటను మళ్ళీ రీ మిక్స్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం వందలాది బిందెలు వాడారు. అప్పట్లో వేటూరి రాసిన ఈ పాటకు చక్రవర్తి సంగీతం అందించారు. ఈ సూపర్ హిట్ పాటను బాలు, సుశీల ఆలపించారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సూపర్ హిట్ చిత్రం 'జిగర్తాండ'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు.


ఈ సినిమాలో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే, తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషిస్తున్నాడు. పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పుట్లో ఈ పాట ఎంత ఆదరణ పొందిందో.. ఇప్పుడు కూడా వరుణ్ తేజ్-పూజా హెగ్డే జంటతో ఈ పాట అందరినీ అలరిస్తుందని హరీష్ శంకర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa