ప్రముఖ దర్శకుడు త్రివిక్రామ్ శ్రీనివాస్ తన తదుపరి చిత్రాన్ని విక్టరీ వెంకటేష్ తో ప్రకటించారు. ఈ సినిమా మల్టీస్టారర్ అని టాక్. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాకి సంగీతాన్ని అందించటానికి మూవీ మేకర్స్ హర్ష వర్ధన్ రామేశ్వర్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సినిమాకి 'వెంకట రమణ' అనే టైటిల్ ని లాక్ చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ అక్టోబర్ లో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఈ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. సూర్యదేవర రాధకృష్ణ హారికా మరియు హాసిన్ క్రియేషన్స్ పతాకంపై ఈ బిగ్గీని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన కీలక అప్డేట్స్ ని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa