ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'లోక్' డిజిటల్ రైట్స్ పై లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 12, 2025, 04:34 PM

ప్రముఖ నటి కల్యాణి ప్రియదర్శియన్ సూపర్ హీరో యూనివర్స్‌లో చిత్రం లోక్ చాప్టర్ 1: చంద్రతో ప్రేషకుల ముందుకు వచ్చింది. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి మహిళా నేతృత్వంలోని 200 కోట్ల మార్క్ ని చేరుకున్న చిత్రంగా ఈ సినిమా చరిత్ర సృష్టించింది. ఈ మైలురాయిని తాకిన మూడవ వేగవంతమైన మలయాళ చిత్రం కూడా ఈ సినిమా నిలిచింది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. రానున్న రోజులలో ఈ విషయం పై క్లారిటీ రానుంది. ఈ చిత్రంలో ప్రేమలు నటుడు నాస్లెన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో నాస్లెన్, శాండీ మాస్టర్, టోవినో థామస్, సన్నీ వేన్ మరియు దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలలో నటించారు. దుల్క్కుర్ సల్మాన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జేక్స్ బెజోయ్ యొక్క సంగీత స్కోర్‌ను కలిగి ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa