ప్రముఖ నటి ఎస్తేర్ రెండో పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. క్రైస్తవ వివాహంలో ధరించే తెల్ల రంగు గౌను వేసుకుని, పడవలో కూర్చున్న ఫోటోను ఆమె SMలో ఓ పోస్ట్ చేశారు. 'జీవితంలో మరో అందమైన సంవత్సరాన్ని ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. ఈ పుట్టినరోజు సందర్భంగా మీ ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. త్వరలోనే ఒక స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేస్తా. వేచి ఉండండి' అంటూ రాసుకొచ్చారు. కాగా సింగర్ నోయల్, ఎస్తేర్ 2019లో లవ్ మ్యారేజ్ చేసుకుని, ఏడాదిలోపే విడిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa