|
|
by Suryaa Desk | Fri, Apr 26, 2024, 06:11 PM
చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలే అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. చంద్రబాబు నిజం మాట్లాడితే ముని శాపం ఉండి తల వెయ్యి ముక్కలవుతుందని వ్యాఖ్యానించారు. శుక్రవారం వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ......గతంలో తెలుగుదేశం జెండా పట్టుకుంటేనే పథకాలు ఇచ్చేవారు.పశ్చిమ నియోజకవర్గంలో వర్ల రామయ్య, బుద్దా వెంకన్నకు కూడా సంక్షేమ పథకాలు అందించాం.చంద్రబాబు, ఆయన పథకాలను ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు.14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు.సీఎం జగన్ పథకాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు.ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊబిలో ఉండి శ్రీలంక అయిందని చంద్రబాబు మాట్లాడలేదా.?చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలే.చంద్రబాబు నిజం మాట్లాడితే ముని శాపం ఉండి తల వెయ్యి ముక్కలవుతుంది.పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు అతని మనసులో మాట నిన్నే బయటపెట్టాడు.పవన్ కళ్యాణ్ సిగ్గు శరం లేకుండా ఇంకా చంద్రబాబు కాళ్ళు పట్టుకొని తిరుగుతున్నాడు. పురందేశ్వరి డైరెక్టుగా పార్టీని తాకట్టు పెట్టింది.చంద్రబాబు, పవన్‌లకు ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారు.చంద్రబాబు చరిత్రలో పేదవారి గురించి ఇప్పుడైనా ఆలోచించాడా..?నందమూరి తారకరామారావు బియ్యం రెండు రూపాయలకి ఇస్తే చంద్రబాబు రూ. 5 చేసిన ఘనుడు. రాష్ట్రంలో మద్యం ఏరులే పారడానికి చంద్రబాబు కారణం కాదా? అని ప్రశ్నించారు.
Latest News