|
|
by Suryaa Desk | Fri, Apr 26, 2024, 06:12 PM
జనం మెచ్చిన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం చేయిస్తోందని వైయస్ఆర్‌సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణమూర్తి మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..... ప్రతిరోజూ పచ్చపత్రికలు,మీడియాలో అసత్యాలు,అబద్దాలతో వార్తలు రాయించడం వాటిని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం చంద్రబాబు. హయాంలో వేలాది స్కూళ్ళు మూతపడ్డాయి. కావాలంటే డేటా చూసుకోవచ్చు. ఇవాళ ఏపీ లో విద్యా వ్యవస్థ బలంగా ఉంది. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని జీఓ ఇచ్చారు. గత ప్రభుత్వం విధానాలతో నిర్వీర్యమైన ప్రభుత్వ విద్యను గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు అని అన్నారు.
Latest News