|
|
by Suryaa Desk | Sat, Apr 27, 2024, 07:37 PM
అనుమానం పెనుభూతంగా మారడంతో భర్తచేతిలో భార్య దారుణహత్యకు గురైంది. ఈ విషాదకర ఘటన పుట్టపర్తి మండలంలోని వెంగళమ్మచెరువులో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.... వెంగళమ్మచెరువుకు చెందిన గ్రామ వలంటీరు ఈడిగ పవనకుమార్, పెడపల్లి బత్తలపల్లికి చెందిన తన మేనమామ కూతురు త్రివేణిని ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. మొదట్లో వీరి కాపురం బాగానే సాగింది. అయితే గత కొంత కాలంగా పవనకుమార్ భార్యపై అనుమానం పెంచుకుని తరచూ గొడవ పడుతుండేవాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి తీవ్రస్థాయిలో గొడవపడ్డాడు. ఆగ్రహానికి గురైన పవనకుమార్.. త్రివేణిని కొడవలితో విచక్షణారహితంగా నరికి హత్యచేశాడు. వారికి 3 సంవత్సరాలు, 4 నెలల వయసుగల ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ కృష్ణమూర్తి పేర్కొన్నారు.
Latest News