|
|
by Suryaa Desk | Sat, Apr 27, 2024, 07:38 PM
సీఎం జగన్‌కు మళ్లీ ఓటు వేస్తే ప్రజల ఆస్తులు ఉండవని కేంద్ర మాజీ మంత్రి, డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మతోపాటు పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. సీఎం జగన్ దోపిడీ విధానాలతో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. ఉచితంగా దొరికే ఇసుకను మాఫీయా చేతులతో కలిపి సీఎం జగన్ ఆయన మంత్రులు వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ప్రజలకు పని చేయాల్సిన వైసీపీ ప్రభుత్వం అవినీతి అక్రమాల్లో మునిగిపోయి, ప్రజల డబ్బులను జలగలా పీల్చివేశారని ధ్వజమెత్తారు. డోన్ నియోజకవర్గంలో నీతికి, అవినీతికి మధ్య పోరాటం జరుగుతోందన్నారు. ప్రజలు బుగ్గన లాంటి దొరల పాలన కోరుకో వడం లేదన్నారు. మంత్రి బుగ్గనను కలిసి ఏమైనా సమస్యలు చెప్పుకోవా లంటే ప్రజలకు కూడా అనుమతి లేకపోవడం దారుణమన్నారు. ఈ సమా వేశంలో మార్కెట్ యార్డు చైర్మన్ రాజా నారాయణమూర్తి, ఓబులాపురం శేషిరెడ్డి, సేనా, ఓంప్రకాష్, మిద్దెపల్లి గోవిందు, ఆకుల శేఖర్ పాల్గొన్నారు.
Latest News