|
|
by Suryaa Desk | Sat, Apr 27, 2024, 07:38 PM
మచిలీపట్నం కూటమి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి సమక్షంలో 500 మందితో కలిసి జనసేన పార్టీలో చేరుతున్నామని మాజీ కౌన్సిలర్ గోకరకొండ బలరాం, కొయిలాపు రాములు తెలిపారు. శుక్రవారం ముగ్గుబజారులోని తన కార్యాలయంలో బలరాం విలేకరులతో మాట్లాడారు. ఆదివారం జీవీఆర్ కల్యాణమండపంలో చేరికల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయనతోపాటు సమావేశంలో వైసీపీ నాయకులు సుంకర భాస్కర్, వెంపల గోపాల్, ఘంటా కుమార్ తదితరులు ఉన్నారు.
Latest News