|
|
by Suryaa Desk | Sun, Apr 28, 2024, 12:08 PM
వైసీపీ ఎమ్మెల్యేలు సైతం సీఎం జగన్‌ను కలిసే పరిస్థితి ఉండదని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. రాచరికం, ఆధిపత్య ధోరణి తరహాలోనే వైసీపీ పాలన సాగిందని విమర్శించారు. "గతంలో నేను వైసీసీ వారి వద్దకు వెళ్లినప్పటికీ అక్కడి వాతావరణం చూశాక ప్రజాసేవకు ఇది వేదిక కాదనిపించింది. వెంటనే బయటకు వచ్చేశా. పవన్ నాయకత్వం, ఆయన ఆశయాలు నచ్చి జనసేనలోకి వచ్చా. ప్రజలు కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలి." అని రాయుడు పిలుపునిచ్చారు.
Latest News