|
|
by Suryaa Desk | Mon, Apr 29, 2024, 10:12 AM
ప్రజారాజ్యం ఎందుకు మూసేశాడో నీ అన్న చిరంజీవినే అడుగు.. అంటూ వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కురసాల కన్నబాబు పవన్ కళ్యాణ్‌కు సూచించారు. పవన్ నామీద కూడా ఇష్టానుసారంగా నోరుపారేసుకున్నాడు. చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కనుక పవన్‌కళ్యాణ్‌పై నేను కొంత సంయమనం పాటిస్తాను. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో నేను కీలకంగా పనిచేసిన వ్యక్తిని. అలాంటిది, నన్నేదో ఆయన పార్టీలో పోషించినట్లు పవన్‌కళ్యాణ్ బిల్డప్ ఇస్తూ మాట్లాడుతాడా..? సామాన్య జర్నలిస్టుగా జీవితం ఆరంభించిన వ్యక్తిని నేను.. ఆయనకు మాదిరిగా ఏమాత్రం కష్టపడకుండా జాక్‌పాట్‌లు కొట్టుకుంటూ ఎదగలేదన్నారు.
Latest News