|
|
by Suryaa Desk | Mon, Apr 29, 2024, 10:15 AM
వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో రెండు ఓట్లు వేస్తే ఇప్పుడున్న నవరత్నాల పథకాలన్నీ కొనసాగుతాయని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ జరగనట్టుగా చరిత్రలో తొలిసారిగా ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. ఎప్పుడూ ఎవ్వరూ చూడని విధంగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీగా అంటే నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే నేరుగా డబ్బులు ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేకుండా వెళ్లాయి. ఇలాంటి లంచాలు లేని, వివక్ష లేని పాలనను చూపించి ఇంటింటికీ జరిగిన మంచిని, అభివృద్ధిని చేసి, చూపించి ఈరోజు మీ అందరి సమక్షంలో నిలబడి మీ బిడ్డ మీ ఆశీస్సులు, దీవెనలు అడుగుతున్నాడని పేర్కొన్నారు.
Latest News