|
|
by Suryaa Desk | Mon, Apr 29, 2024, 10:19 AM
బాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమే. చంద్రబాబును నమ్మడమంటే పసుపుపతిని ఇంటికి తీసుకురావడమే అని సీఎం జగన్ అన్నారు. అయన మాట్లాడుతూ.... ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి.. ఇదే కూటమి గతంలో ప్రజలను మోసం చేసింది. చంద్రబాబు హామీలను ఎల్లో మీడియా ఊదరగొట్టింది. రుణమాఫీ అంటూ చంద్రబాబు రైతులను మోసం చేశారు. డ్వాక్రా రుణాల పేరుతోనూ చంద్రబాబు మోసం చేశారు. ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు. ఇంటికో ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు. అర్హులైన వారికి మూడు సెంట్ల స్థలం ఇస్తామని మోసం చేశారుఅంటూ చంద్రబాబుపై సీఎం జగన్ నిప్పులు చెరిగారు.
Latest News