|
|
by Suryaa Desk | Mon, Apr 29, 2024, 01:12 PM
పామూరు పట్టణంలోని మూడవ నంబర్ మద్యం దుకాణం తనిఖీకి ఆదివారం వెళ్ళిన తహశీల్దార్ విధులకు ఆటంకం కలిగించిన 14 మందిపై కేసు నమోదు చేసినట్లు ఏస్సై సైదుబాబు తెలిపారు. తహశీల్దార్ షాకీర్ పట్టణంలోని మూడో నంబర్ మద్యం దుకాణంలో తనిఖీలు నిర్వహిస్తుండగా షాపు నిర్వాహకులు విధులకు ఆటకం కలిగించారు. తహశీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Latest News