![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 07:26 PM
అక్కచెల్లెమ్మలకు రాజమహేంద్రవరంలో అండగా ఉంటానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. స్థానిక ఆదేమ్మదిబ్బ వాంబేకాలనీ వద్ద గురువారం సాయంత్రం నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన మీ భద్రత-మా బాధ్యత కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నేరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మీకు ఎటువంటి సమస్య వచ్చినా నాయకులు అందుబాటులో ఉంటారని వారు సరిగ్గా స్పందించకపోతే నేరుగా నా నెంబరు 86939 34567కు ఫోన్ చేయవచ్చన్నారు. పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో సీఐ గౌడ్, కాశి నవీన్‌కుమార్, రెడ్డి మణి, బుడ్డిగ రాధ, కరగాని వేణు, రాచపల్లి ప్రసాద్, పోలీసు అధికారులు, మహిళలు పాల్గొన్నారు.
Latest News