![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 28, 2024, 07:27 PM
సమస్యల పరిష్కారమే దిశగా మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ నిర్వహిస్తున్నారు. సమస్యలు విన్నవించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి జనం పెద్ద ఎత్తున ఉండవల్లిలోని లోకేష్ నివాసానికి తరలివస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచే వస్తున్నారు.ఇందులో భాగంగా విశాఖ జిల్లా, గాజువాక మండలం, దువ్వాడలో రూ.4 కోట్ల విలువైన తమ 84 సెంట్ల భూమిని గత వైసీపీ ప్రభుత్వ అండతో దేవెళ్ల వెంకటరమణ, రావి సత్యనారాయణ కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలని గాజువాక మండలం, డ్రైవర్ కాలనీకి చెందిన చూచుకొండ శ్రీనివాసరావు, జాగరపు తాతారావు మంత్రి లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
Latest News