by Suryaa Desk | Mon, Jul 01, 2024, 02:55 PM
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ సోదరుడు ప్రభుదాస్ అరెస్ట్ అయ్యారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్న కేసులో సురేష్ సోదరుడు ప్రభుదాసు అరెస్ట్ అయ్యారు. రాత్రి ఉద్ధండరాయునిపాలెం నుంచి విజయవాడకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల విచారణలో అవి నందిగం ప్రభుదాస్‌కు చెందిన ఇసుక లారీలుగా గుర్తించడం జరిగింది. నందిగం ప్రభుదాస్‌ను తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. రెండు లారీలు, కారును స్వాధీనం చేసుకున్నారు.
Latest News