పట్టణంలో ఎక్కడ చెత్తాచెదారం ఉండకూడదు
 

by Suryaa Desk | Mon, Jul 01, 2024, 05:45 PM

నందికొట్కూరు పరిశుభ్రంగా ఉండాలంటే అందుకు కార్మికులే ప్రధాన మూలమని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య కార్మికులకు సూచించారు. ఆదివారం పట్టణంలోని 16వ వార్డులో పారిశుధ్య పనులను పరిశీలించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణం పరిశుభ్రంగా ఉండాలన్నా, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న ప్రధానంగా పారిశుధ్య కార్మికులు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తేనే సాధ్యమవుతుందని అన్నారు. పట్టణంలో ఎక్కడా చెత్తాచెదారం పేరుకుపోయిందన్న ఫిర్యాదులు రాకూడదన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు లింగమయ్య, బ్యాటరీ బాషా, శ్రీను, నిమ్మకాయల రాజు, మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు. నందికొట్కూరులోని సీఎస్‌ఐ చర్చిలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్యను ఆ సంఘం సభ్యులు సన్మానించారు. ఆదివారం ఎమ్మెల్యే ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత గురువులు ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. అనంతరం సీఎస్‌ఐ చర్చి సంఘం సభ్యులు జాన్‌, రవి తదితరులు ఎమ్మెల్యేను సన్మానించారు.

Latest News
Southern Railway initiates probe into Mysore-Darbhanga Bagmati Express derailment Sat, Oct 12, 2024, 05:24 PM
Women’s T20 WC: India need every player to step up and deliver their best, says Manjrekar Sat, Oct 12, 2024, 05:22 PM
Twin road accidents kill 6, injure 8 in Afghanistan Sat, Oct 12, 2024, 04:42 PM
India name squad for T20 World Cup for Blind to be held in Pakistan Sat, Oct 12, 2024, 04:27 PM
NIA commences probe into TN train accident Sat, Oct 12, 2024, 04:24 PM