by Suryaa Desk | Tue, Jul 02, 2024, 01:40 PM
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్డీయే పక్షాల ఎంపీలతో తొలిసారిగా మోడీ భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం పార్లమెంట్ లైబ్రరీ భవనంలో మిత్రపక్ష ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. లోక్సభ సమావేశాల్లో రాహుల్ గాంధీ, విపక్షాల మాటల దాడుల నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన విధానాలపై ఎన్డీయే కూటమి ఎంపీలకు మోడీ దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలంతా కచ్చితంగా హాజరుకావాలని ఆదేశించారు. దేశసేవ ప్రథమ కర్తవ్యమని ఎంపీలందరికీ మోడీ సూచించారు సూచించారు.
Latest News