by Suryaa Desk | Tue, Jul 02, 2024, 01:42 PM
ప్రముఖ సినీ దర్శకుడు రావిపూడి అనిల్ తన స్వగ్రామమైన యద్దనపూడి మండలంలోని చిలుకూరివారిపాలెం ఆంజనేయస్వామి ఆలయం లో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్వరలో తాను దర్శకత్వం వహించే కొత్త సినిమా స్క్రిప్ట్ కు పూజలు చేయించారు. తదుపరి అనంతవరం గ్రామంలోని శివాలయంలో ఆయన విశేషపూజలు నిర్వహించారు. అనిల్ కుటుంబ సభ్యులను వేద పండితులు ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు. బంధుమిత్రులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
Latest News