జవాన్ల కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలి
 

by Suryaa Desk | Tue, Jul 02, 2024, 02:16 PM

లడఖ్‌లో యుద్ధట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు జవాన్లు మరణించిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. దేశ రక్షణలో వీరి సేవలు చిరస్మరణీయమని, వారి త్యాగాలు మరువలేనివన్నారు. కృష్ణాజిల్లా పెడన మండలం చేవెండ్రకు చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి (జేసీవో) ముత్తుముల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్‌ కు చెందిన సుభాన్‌ ఖాన్‌ల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయా కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరణించిన జవాన్ల కుటుంబానికి రూ.1 కోటి చొప్పున ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఆయా నియోజకవర్గాలకు చెందిన వైయస్ఆర్ సీపీ నాయకులు వీరి అంత్యక్రియల్లో పాల్గొనాలని, వారి కుటుంబాలకు బాసటగా నిలవాలని వైయస్‌ జగన్‌ ఆదేశించారు.

Latest News
Yemen's Houthis claim drone attack on ship in Arabian Sea Sat, Oct 19, 2024, 02:03 PM
Over 3 million people in Sudan at risk of cholera: UNICEF Sat, Oct 19, 2024, 02:00 PM
Delhi BJP slams Kejriwal over pollution crisis, calls for 'No to Kejriwal' in polls Sat, Oct 19, 2024, 01:44 PM
Isha Foundation stands strong as TN Police report in SC clears missing persons claims Sat, Oct 19, 2024, 12:54 PM
BJP, AAP responsible for Delhi's worsening pollution crisis: Congress Sat, Oct 19, 2024, 12:43 PM