by Suryaa Desk | Tue, Jul 02, 2024, 02:28 PM
ప్రొద్దుటూరు స్థానిక రామేశ్వరంపేట లోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మండల విద్యాశాఖ అధికారి శోభారాణి, మురుకూటి సూర్యనారాయణ రెడ్డి సేవా ట్రస్ట్ ఛైర్మన్ సూర్యనారాయణ రెడ్డి విద్యార్థులకు పలకలను వితరణ చేశారు. అనంతరం వారిచే పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి తవ్వా సురేష్, ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
Latest News