జగన్ ప్రభుత్వంలో చేసిన భూముల రీసర్వేని రద్దు చెయ్యాలి
 

by Suryaa Desk | Tue, Jul 02, 2024, 05:51 PM

వైసీపీ ప్రభుత్వం జగనన్న భూరక్ష పథకం కింద తీసుకొచ్చిన భూముల రీసర్వేతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే భూ రీసర్వేను రద్దు చేయాలని ప్రకాశం జిల్లా, పుల్లలచెరువు రైతులు డిమాండ్‌ చేశారు. సోమవారం పుల్లలచెరువు తహసీల్దార్‌ కార్యాలయంలో డీటీ కిరణ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ...  మండలంలోని చౌటపల్లిలోని 102 సర్వేనంబర్ల పట్టా భూములును ఇనాం భూములుగా మార్చారని అన్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎల్‌పీ నెంబర్లతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రీ సర్వే తరువాత భూముల కొలతలు మారి రైతుల భూములు తప్పుగా ఉన్నాయన్నారు. టీడీపీ ప్రభుత్వం తక్షణమే స్పందించి రీసర్వేను రద్దు చేసి పాత విధానంలో భూముల ఆన్‌లైన్‌ చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

Latest News
India sees 74 pc drop in income disparity since AY15, direct tax collection highest in 14 years Sat, Oct 26, 2024, 12:40 PM
RG Kar financial fraud case: Health Department to initiate probe against two doctors Sat, Oct 26, 2024, 12:30 PM
India's diverse talent to use AI for societal growth: Meta’s chief AI scientist Sat, Oct 26, 2024, 12:27 PM
2nd Test: India reach 81/1 at lunch, need 278 runs for win against NZ Sat, Oct 26, 2024, 12:07 PM
FIR against Jodhpur-based hospital in RAS Priyanka Vishnoi death case Sat, Oct 26, 2024, 12:03 PM