by Suryaa Desk | Sat, Nov 23, 2024, 10:55 AM
సభలో మంత్రి సవిత తీవ్ర అభ్యంతరమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి సవిత తక్షణమే రాష్ట్రంలోని మహిళలకు క్షమాపణ చెప్పాలి అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు డిమాండ్ చేసారు. అయన మీడియాతో మాట్లాడుతూ..... మంత్రి పదే పదే సభలో కాపుల గురించి ప్రస్తావించారు. కాపులు ఓటేశారు కాబట్టే కూటమి అధికారంలోకి వచ్చింది.
ఈ ఆరు నెలల్లో కాపులకు ఏం చేశారో మీరు సమాధానం చెప్పాలి. పది వేల కోట్లు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ఒక్క రూపాయి ఇవ్వలేదు. దేశంలో ఎవరూ చేయనంత సంక్షేమం కాపులకు వైయస్ జగన్ చేశారు. బటన్ నొక్కడం వల్ల మహిళలు గంజాయికి, మద్యానికి అలవాటు పడ్డారనడం దుర్మార్గం అని మండిపడ్డారు
Latest News