by Suryaa Desk | Sat, Nov 23, 2024, 10:58 AM
ఎస్సీ, బీసీ, మైనార్టీలను అవమానించేలా కూటమి నేతల వైఖరి ఉంది అని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు. మీడియాతో అయన మాట్లాడుతూ.. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్..హోంమంత్రిని చులకన చేసి మాట్లాడారు. దళిత హోంమంత్రి పదవిలో ఉండటం వల్లే చులకనగా మాట్లాడారని మేం భావిస్తున్నాం. మంత్రి సత్యకుమార్ ముస్లిం, మైనార్టీలను కించపరిచేలా మాట్లాడారు. ఈరోజు మంత్రి సవిత.. మహిళలు గంజాయి, మద్యానికి అలవాటైపోయారంటున్నారు.
మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక పెద్దలు ఉన్నారని మేం భావిస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు. ప్రతీ ప్రైవేట్ స్కూల్లో 25 శాతం పేదలకు సీట్లు కేటాయించాలని చట్టం చెబుతోంది. వైఎస్ జగన్ అమ్మఒడి ద్వారా పేదలు చదువుకునేలా చర్యలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్ధుల కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేసారు.
Latest News