by Suryaa Desk | Sat, Nov 23, 2024, 12:55 PM
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా కొనసాగుతోంది. ఫలితాల సరళి చూస్తుంటే అధికార, ప్రతిపక్షాల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది.జార్ఖండ్‌లో అధికార మార్పిడి ఖాయమని వెల్లడించాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా - కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి భంగపాటు తప్పదని అంచనా వేశాయి. కానీ నేడు వెలువడుతున్న అధికారిక ఫలితాలతో గ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు అవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.కాగా రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13, 20 తేదీల్లో రెండు విడుతల్లో ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగ్గా, మిగిలిన 38 స్థానాలకు రెండో విడతలో ఓటింగ్ నిర్వహించారు. జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 41. అధికార పక్షం.. జేఎంఎం 41, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, సీపీఐ(ఎంఎల్) నాలుగు చోట్ల పోటీ చేయగా, ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి.. బీజేపీ 68, ఏజేఎస్‌యూ 10, జేడీయూ రెండు, లోక్‌జన్‌శక్తి(రామ్ విలాస్) పార్టీ ఒక చోట పోటీ చేశాయి.మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి మెజార్టీకి మించిన ఆధిక్యంతో విజయం దిశగా దూసుకుపోతుండగా.. ఇటు జార్ఖండ్‌లో ఇండియా కూటమి హవా సాగుతోంది
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎమ్‌ఎల్) అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో ముందంజలో ఉన్నారు. జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్‌ను(41) దాటి 50కి పైగా స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతున్నారు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులు 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.అయితే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని మెజార్టీ సర్వేలు ప్రకటించాయి. ఎన్డీఏ కూటమి 42 నుంచి 48 స్థానాల్లో, జేఎంఎం 25 -30 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైన సంగతి తెలిసిందే.
ఇండియా కూటమిలో జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెఎస్, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఉండగా.. ఎన్డీయేలో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ , జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఉన్నాయి.
Latest News